తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (30.07.2026, గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసి పరామర్శించనున్నారు. వైయస్ జగన్ గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు. జైలులో డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అయి, ఆయనను పరామర్శిస్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వనున్నారు. అనంతరం వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.