ఇవేం ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిద్రపోతుందా?: అవినాష్‌ రెడ్డి

 

 పులివెందుల: ఏపీలో ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. పులివెందులలో టీడీపీ గూండాల దాడులు, పోలీసుల తీరుపై అవినాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులే ఓటర్లను అడ్డుకుంటున్నారు. వందల మంది బయట వ్యక్తులు పులివెందులకు వచ్చారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మా అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని టీడీపీ చూస్తోంది. ఇంత జరుగుతున్నా ఎస్‌ఈసీ నిద్రపోతుందా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓటర్లను పచ్చమూకలు అడ్డుకుంటున్నాయి. పులివెందుల 11, 12  బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు రాళ్లు విసురుతున్నారు. బూత్‌లకు ఎవరూ రాకుండా పచ్చమూకలు అడ్డుకుంటున్నారు. పులివెందులలో 20 వార్డుల్లో టీడీపీ గూండాలు మకాం చేశారు. అన్ని పోలింగ్‌ బూతులను టీడీపీ నేతలు ఆక్రమించారు.

పులివెందులలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ గూండాలు.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పచ్చమూకలు ఖూనీ చేస్తున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్‌ కాలేజీ వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్‌ బూత్‌ వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు. తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్‌ బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ..  మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్‌ ఇచ్చారు. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అనంతరం డీఎస్పీని మహిళలు నిలదీయడంతో మురళీ నాయక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

Back to Top