వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ ఎదుట దస్తగిరి హల్‌చల్‌

 
వైఎస్సార్ జిల్లా: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వచ్చి వివేకా హత్య కేసు హంతకుడు దస్తగిరి హాల్ చల్ చేశాడు. ఇందుకు పోలీసులు సహకరించినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని కాన్వాయ్‌లో వెళ్తున్న సమయంలో వివేకా హత్య కేసు హంతకుడు దస్తగిరి హాల్ చల్ చేశాడు. పోలీస్ ప్రొటెక్షన్‌తో వైఎస్‌ జగన్ కాన్వాయ్‌ను దస్తగిరి అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ దస్తగిరితో టీడీపీ హైడ్రామాకు తెరలేపిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ సీఎం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వైఎస్ జగన్ కాన్వాయ్‌లోకి దస్తగిరి కారు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల సహకారంతోనే దస్తగిరి కారు అడ్డుగా పెట్టాడని ఆరోపించారు.  

కావాలనే కాన్వాయ్‌లోకి అనుమతించి.. ఆ తర్వాత పక్కకు తప్పించినట్లు డ్రామా చేశారని అన్నారు. ఒక హత్య కేసులో ముద్దాయిని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న  వీఐపీ కాన్వాయ్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. టీడీపీ, పోలీసులు కలిసే దస్తగిరితో హైడ్రామాకు తెరలేపారని నేతలు మండిపడుతున్నారు. కాగా, గతంలోనే వివేకాను తానే చంపానని మీడియాలో స్వయంగా చెప్పిన దస్తగిరి. 

Back to Top