పోలింగ్‌ బూత్‌లలో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లకు అనుమతి నిరాకరణ

ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

పులివెందుల : పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకోవడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఆర్వో కార్యాలయానికి వెళ్లారు.

అయితే, వైయ‌స్‌ జగన్‌ను అధికారులు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. పోలింగ్‌ ఏజెంట్లకు అనుమతి నిరాకరించడంపై అధికారుల తీరును ప్రశ్నించారు.

Back to Top