పులివెందులలో రీపోలింగ్‌ జరపాలి

వైయస్‌ జగన్‌ డిమాండ్‌

పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ బరితెగింపు

వైయస్‌ జగన్‌ ఫైర్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మీడియా అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ బూత్‌ల స్వాధీనం

పోలింగ్‌ బూత్‌ల నుంచి వైయస్సార్‌సీపీ ఏజెంట్ల గెంటివేత

70 బూత్‌ల నుంచి వైయస్సార్‌సీపీ ఏజెంట్ల తరిమివేత

కేవలం 10 బూత్‌లలో మాత్రమే వైయస్సార్‌సీపీ ఏజెంట్లు

మరి ఇదేనా ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియ?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

వైయస్సార్‌సీపీ అభ్యర్థులు. నాయకులపై దాడి

ఎక్కడిక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్‌. పోలీసుల చోద్యం

అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోంది

అలా ఇప్పుడు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు

రేపు అదే కొనసాగింపు. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

పులివెందుల: స్థానిక ఎన్నికల్లో మున్సిపల్‌ పోల్‌ సందర్భంగా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పులివెందులలో బరి తెగించిన టీడీపీ తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ బూత్‌లు స్వాధీనం చేసుకుందని, పట్టణంలో మొత్తం 80 బూత్‌లో ఉంటే, ఏకంగా 70 బూత్‌ల నుంచి వైయస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేశారని ఆయన వెల్లడించారు. వారందరినీ స్వయంగా మీడియాకు చూపిన ఆయన, ఆ తర్వాత ఆర్‌ఓ వద్దకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. పులివెందులలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇక్కడ రీపోలింగ్‌ జరపాలని శ్రీ వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఇంత అప్రజాస్వామికంగా జరిగే ఎన్నికలు.. అసలు ఎన్నికలేనా? అని శ్రీ వైయస్‌ జగన్‌ గట్టిగా నిలదీశారు.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

పులివెందులలో రీపోలింగ్‌ జరపాలి:
    రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అధికార పార్టీ యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తోంది. పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌లు ఉంటే, వాటిలో 70 బూత్‌లలో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేశారు. ఇప్పుడు వారందరినీ పులివెందుల ఆర్‌ఓ దగ్గరికి తీసుకెళ్తున్నా. అసలు మా పార్టీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని నిలదీయబోతున్నాను. వీటన్నింటి నేపథ్యంలో పులివెందులలో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేయబోతున్నాను.

తెలుగుదేశం గుండాల స్వైర విహారం:
    పులివెందులలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గుండాలు దగ్గరుండి ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి లాగి బయటకు పంపేశారు. ఎక్కడా మా పార్టీ ఏజెంట్లను బూత్‌ల్లోకి పంపించే కార్యక్రమం జరగలేదు. పోలీసులు దగ్గరుండి, తెలుగుదేశం వారికి సహకరిస్తున్నారు.
అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది.

పులివెందులలో ఇదీ అరాచక పర్వం. అందరికీ తెలిసే ఇదంతా..:
    పులివెందులలో ఇన్ని జరుగుతున్నా కనీసం అడిగే నాథుడు లేడు.
ఎస్పీకి ఫోన్‌ చేశాం. కలెక్టర్‌కు ఫోన్‌ చేశాం. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. పొద్దున నుంచి పులివెందులలో జరిగిన ఘటనల క్రమం చూస్తే.. తెల్లవారుజామున 4 గం.  నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూత్‌లు ఆక్రమించారు. అలా పోలింగ్‌ కేంద్రాలు ఆక్రమించి, ఓటర్లను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. మా పార్టీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీలమ్మపై దాడి చేశారు. పోలింగ్‌ ఏజెంట్‌ సునంద చెయ్యి విరగ్గొట్టారు. 
    ఓటు వేయడానికి వచ్చిన ప్రజలను పోలింగ్‌ కేంద్రాల వద్దే అడ్డుకున్నారు. మహిళలను బెదిరించారు. ఓటర్‌ స్లిప్‌లను బలవంతంగా లాక్కొని వెనక్కి పంపించారు. అలా పోలింగ్‌ బూతులను ఆక్రమించి దొంగ ఓట్లు వేస్తున్నారు. అసలు ఓటర్‌ వచ్చే సరికే, దొంగ ఓట్లు వేస్తున్నారు. 
    మరోవైపు పోలీసులు టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తూ, వైయస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. పలు చోట్ల లాఠీఛార్జ్‌  చేశారు. మా పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థిని బలవంతంగా పోలీసులు జీప్‌లోకి ఎక్కించుకొని పోయారు.

మీడియాపైనా దాడి:
    ఎన్నికల అక్రమాలు చిత్రీకరిస్తున్న ఇండియా టుడే ఛానల్, ఎన్టీవీ ఛానల్‌ రిపోర్టర్లు, కెమెరామెన్ల మీద దాడి చేశారు. వారి కెమెరాలు, సెల్‌ ఫోన్లు ధ్వంసం చేశారు.
    తమను ఓటు వేయనీయడం లేదని చివరకు ఓటర్లు ధర్నాకు దిగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. కనీసం వారిని తీసుకెళ్లి ఓట్లు వేయించే కార్యక్రమం కూడా జరగడం లేదు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. 
    ఇక్కడ నా ఇల్లు, ఓటు ఉంది కాబట్టి, ఈ బూత్‌లో మాత్రమే మా పార్టీ ఏజెంట్లను కూర్చోబెట్టారు. ఇంకా ఆశ్చర్యం ఎక్కడ కనిపిస్తుందంటే.. పులివెందులతో పాటు, కడప, జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, చిలకలూరిపేట, తాడిపత్రి, మదనపల్లి, చీమకుర్తి, కుప్పంలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తప్పుడు సంప్రదాయం మొదలుపెట్టారు. మరి రేపు..?:
    నిజంగా నేను చంద్రబాబునాయుడుని అడుగుతా ఉన్నాను. ‘సిగ్గుండాలయ్యా నీకు చంద్రబాబునాయుడు’. ఇదే ఎస్సీని కూడా  అడుగుతున్నాను. టీడీపీకి సహకరిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సెట్‌ చేస్తున్న ఒక తప్పుడు సంప్రదాయం, రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది?. భావితరానికి మీరు పంపిస్తున్న మెసేజ్‌ ఏమిటి?. 
    రేపు పొద్దున ఇంకా ఎన్నికలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో జరగవు. ఈ మాదిరిగా కక్షలు, కార్పణ్యాలతో, ఇలా ఎలక్షన్లు నిర్వహిస్తే రేపు పొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మీరు గతంలో ఇదే మాదిరిగా చేస్తే తప్పు లేనప్పుడు, మేము చేస్తే తప్పు ఏముంది అని.. కార్యకర్తలు కూడా తిరగబడతారు. అలా ఇప్పుడు మీరు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెడుతున్నారు.

సీఎంగా చంద్రబాబు అనర్హుడు:
    చంద్రబాబునాయుడు దాదాపు 80 ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దరిద్రమైన పనులు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులు చూస్తే, అసలు ఈ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒక్క రోజు కూడా అర్హుడు కాదు. రొటేషన్‌ పద్ధతిలో ఓట్లన్నీ వీళ్ళంతకు వీళ్ళే గుద్దుకుంటా ఉన్నారు. కళ్ళ ముందే ఇలా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఇక్కడ బందోబస్తు కోసం 1000 మంది పోలీసులను తీసుకొచ్చినట్లు చెప్పారు. అసలు ఆ పోలీసులను ఎందుకు తీసుకొచ్చారంటే ఈ అక్రమాలకు సపోర్ట్‌ చేయడం కోసం.

కళ్లెదుటే అన్నీ. సుప్రీంకోర్టు ఆదేశాలూ భేఖాతరు:
    మన కళ్ళెదుటే ఇన్ని వందల మంది ప్రతి బూత్‌ దగ్గర కనిపిస్తున్నారు. పక్కాగా తెలుగుదేశం పార్టీ గుండాలు కనిపిస్తున్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. 70 బూత్‌ల్లో నుంచి మా పార్టీ ఏజెంట్లను తరిమేశారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్‌ చేసి అడిగాను. ఆయనకన్నీ తెలుసు. అన్నీ చూస్తూ అలాగే ఊర్కుంటారు. కలెక్టర్‌కు కూడా అన్నీ తెలుసు. అయినా ఆయన అలాగే అన్నీ చూస్తూ కూర్చుంటారు. మరి అలాంటప్పుడు ఇది ఏ రకంగా నిజమైన ఎన్నిక?.
    పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఎన్ని చోట్ల ఆ ఏర్పాట్లు చేశారు? సీసీ టీవీ లైవ్‌ ఫుటేజ్‌ లేకుండా మీరు ఏ రకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు?.

చివరకు ఏ స్థాయికి దిగజారారంటే..
నా ఛాపర్‌ ప్రయాణంపైనా కుట్ర చేశారు:

    బెంగళూరు నుంచి ఛాపర్‌లో నేను బయలుదేరాను. ఇక్కడికి రావడానికి నిన్న అనుమతి కూడా ఇచ్చారు. కానీ, నా ఛాపర్‌ ప్రయాణం మధ్యలో ఉండగా, పులివెందులలో ఛాపర్‌ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. పులివెందులలో జగన్‌ ఛాపర్‌ ల్యాండ్‌ కావొద్దు. 3 గం. తర్వాతే నేను ఇక్కడికి రావాలని అన్నారు. అలా అంటూ, నిన్న ఇచ్చిన పర్మిషన్‌ రద్దు చేసినట్లు ప్రకటించారు.
    దీంతో విషయాన్ని నేరుగా పౌర విమానయాన శాఖకు చెప్పడం జరిగింది. దాంతో వారు అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. ఛాపర్‌ ల్యాండింగ్‌కు నిన్న పర్మిషన్‌ ఇచ్చి, హఠాత్తుగా ఈరోజు దాన్ని రద్దు చేయడాన్ని ఆ శాఖ అధికారులు తప్పు బట్టారు. అంతే కాకుండా ఛాపర్‌ మార్గమధ్యలో ఉన్నప్పుడు ఇలా ల్యాండింగ్‌ పర్మిషన్‌ రద్దు చేయడం సరికాదని వారు తేల్చి చెప్పడంతో, ఎట్టకేలకు ఇక్కడ ఛాపర్‌ ల్యాండింగ్‌కు ఒప్పుకున్నారు. అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతోంది అన్న విషయం అర్థం చేసుకోవచ్చు.

అందుకే అలాంటివి పుట్టుకొస్తున్నాయి:
    పెద్దలంతా కలిసి ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎలా?.  నక్సలిజం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది?. ప్రజలను కాపాడాల్సిన వాళ్లే, ప్రజలను భక్షించే కార్యక్రమాలు చేసినప్పుడు, ప్రజలను కాపాడాల్సిన వారే, ప్రజలకు అన్యాయం చేసినప్పుడు నక్సలిజం పుడుతుంది, కాక్రోచ్‌లు పుడతాయి.

రాష్ట్రంలో దయనీయ పరిస్థితి:
    ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా మారింది. దానికి కారణం పాలకులుగా ఉన్న వారు. వారు తమ మనస్సాక్షిని అడగాలి. మీరు చేస్తున్న పాలన బాగుందా అని? ఒకవేళ మీరు చేస్తున్న పాలన బాగుంటే, మరీ ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉందా?
    సూపర్‌ సిక్స్‌లు లేవు. సూపర్‌ సెవెన్లు లేవు. ప్రజలకి ఇచ్చిన బాండ్లు అన్నీ ఒట్టివే అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పిల్లలకు ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ లేక.. విద్యాదీవెన, వసతిదీవెన రాక పిల్లలు తిరగబడుతున్నారు. ఉద్యోగస్తులకు మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ అమలు కాక, వారూ తిరగబడుతున్నారు. మహిళలకు చివరికి సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు. దాంతో వారూ తిరగబడుతున్నారు. రైతులకు ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులకు ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా తేలడంతో, వారూ తిరగబడుతున్నారు.

అందుకే చంద్రబాబుకు ఎన్నికలంటే భయం:
    రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా చంద్రబాబునాయుడితో సంతోషంగా లేరు. అందుకే ఎన్నికలు జరగకూడదన్న కుట్ర. అలా ఎన్నికలను బుల్డోజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ పాలన బాగుంటే, నిజంగా మీరు ప్రజలకు మంచి చేశారని అనుకుంటే, ఎందుకు ఇంతగా దిగజారాల్సిన పరిస్థితి?. స్థానిక ఎన్నికలు ఎందుకు సాఫీగా నిర్వహించడం లేదు?. ఎందుకిన్నిన్ని అక్రమాలు చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించాలి.
    
అది మా హక్కు. అందుకే అడుగుతాం:
    ఎన్నికలు సజావుగా జరగనప్పుడు ఆర్‌ఓ దగ్గరికి వెళ్లి అడిగే హక్కు మాకుంది. దాన్ని అడ్డుకునే కార్యక్రమం ఎవరైనా చేస్తే, ఇంతకన్నా ఇంకా దారుణం అనేది ఉండదు. రాష్ట్రంలో దారుణ పరిస్థితిపై ఎన్డీఏ కూడా స్పందించాలి. ఎందుకంటే వారి భాగస్వామ్య పార్టీనే ఇక్కడ ఇన్ని అరాచకాలు చేస్తోంది కాబట్టి.. వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top