చంద్ర‌బాబు రైతు ద్రోహి

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు

నెల్లూరు జిల్లా:  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రైతు ద్రోహి అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. గురువారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సోమ‌శీల ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ..  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. సమాజంలో రైతుల గౌరవాన్ని పెంచిన నాయకుడు వైయ‌స్ఆర్‌ అని, రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన నాయకుడిగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సోమశిల జలాశయానికి నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

Back to Top