ఆధ్యాత్మిక సేవలు, ధర్మ పరిరక్షణలో మహాస్వామి సేవలు చిరస్మరణీయం 

 ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యంపై  వైయస్‌ జగన్‌ సంతాపం 

తాడేపల్లి: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాల్లో ఒకటైన ఉరవకొండ గవిమఠం 8వ పీఠాధిపతి శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  సుదీర్ఘకాలం పాటు ఆధ్యాత్మిక, ధార్మిక సేవలతో భక్తులకు మార్గదర్శకులుగా నిలిచిన మహాస్వామి గవిమఠం అభివృద్ధికి, సనాతన ధర్మ పరిరక్షణకు విశేష కృషి చేశారని  వైయస్‌ జగన్‌ కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో, భక్తులకు విలువైన సందేశాలను అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన  వైయస్‌ జగన్‌, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 

Back to Top