నేతన్న నేస్తం అమలు చేయాలంటూ కేతిరెడ్డి పోరుబాట

ధర్మవరంలో చేనేత కార్మికులతో భారీ బైక్ ర్యాలీ
 

ధర్మవరం: చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ధర్మవరం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోరుబాట పట్టారు. చేనేత కార్మికులతో కలిసి ధర్మవరం పట్టణంలోని శివానగర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
గత రెండేళ్లుగా నేతన్న నేస్తం అమలు చేయకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నేతన్న నేస్తం కింద మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కలిపి ఒక్కో చేనేత కార్మికుడికి రూ.75 వేలు అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీలో చేనేత కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top