బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరి మోసపూరితం

హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం బీసీలను మభ్యపెట్టేందుకే: బెల్లాన చంద్రశేఖర్‌

విజయనగరం: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌ విమర్శించారు. విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, అది కొట్టివేయబడిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు. సాధ్యం కాదని తెలిసినా బీసీలను మభ్యపెట్టే ధోరణితోనే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో బీసీలకు 56 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చి గౌరవించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయమని, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాసేవలో ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Back to Top