అనంతపురం: శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు, ఇల్లూరు, ముంటిమడుగు ఎంపీటీసీ స్థానాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ముఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వై.నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి ప్రతి కార్యకర్త అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇవ్వాలని, నాయకులు కార్యకర్తలతో నిరంతరం మాట్లాడాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అందుబాటులో ఉండే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క కార్యకర్తా భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి పలువురు యువకులు కల్లూరు గ్రామంలో టీడీపీ నుంచి పలువురు యువకులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. జయప్రకాశ్, శ్వంత్‌రెడ్డి, రఘు యాదవ్, నరేష్ నాయుడు, కళ్యాణ్ వాల్మీకి, వీరాంజి, నరేంద్ర, సిద్ధు, ఫయాజ్, శరత్, రాము అంగజాల, బన్నీ, మంజు, నందు, ఏరిస్వామి తదితరులకు డాక్టర్ సాకే శైలజానాథ్ వైయస్ఆర్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదినారాయణ, చిదంబరెడ్డి, గాంధీ, శ్రీనివాసులు, కల్లూరు ప్రసాద్, లక్ష్మీదేవమ్మ, దేవా జగన్, సురేష్, మోహన్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వీర, బాలిరెడ్డి, నల్లప్ప కేశవయ్య, శిక్షావలి, రఫీ, రామకృష్ణ, రామాంజనేయులు, బసిరెడ్డి, నరసింహులు, రవి, కృష్ణ, వీరేష్, షారుణ్, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.