పార్టీ గెలుపుకు అందరూ సమష్టిగా కృషి చేయాలి

 హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి టీఎన్‌ దీపిక

హిందూపురం: హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలోని చేతన కన్వెన్షన్‌ హాల్‌లో మండల విస్తృతస్థాయి సమావేశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి టీఎన్‌ దీపిక పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా ప్రతి పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజల్లోకి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన గుర్తింపు కార్డులను నాయకులు, కార్యకర్తలకు దీపిక అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పంచాయతీ అధ్యక్షులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top