ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని భోగాపురం, కొప్పాక, జగన్నాధపురం, గార్లమడుగు, దుగ్గిరాల తదితర గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్పందించారు. సంబంధిత ఆర్డీఓను కలిసి తిరస్కరణకు గల కారణాలను వివరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి నామినేషన్‌ను సమగ్రంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి అర్హులైన అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల తిరస్కరణకు స్పష్టమైన కారణాలను వెల్లడించాలని కోరారు. వైయస్ఆర్‌సీపీ మద్దతు అభ్యర్థులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.