కావలిలో టీడీపీకి బిగ్ షాక్ 

 వైయ‌స్ఆర్‌సీపీలోకి 40 మంది టీడీపీ కార్యకర్తలు 

నెల్లూరు జిల్లా: ఎన్నికల వేళ కావలిలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కావలి టౌన్ పరిధిలోని వెంగాయగారిపాళెం 19వ వార్డుకు చెందిన 40 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.
కావలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో గుడిపల్లి తిరుపతి, జంపాని గోపి, కోర వెంకటేష్, మాతిన మహేంద్ర, మాతిన తిరుమల, జంపాని వెంకట్రావు, దాదల్ అనిల్, జంపాని సందీప్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ కండువాలు కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకత్వం, ఆయన హుందాతనం, అందరినీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం నచ్చడంతో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు కొత్తగా చేరిన టీడీపీ నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో 40 మంది టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ఆ పార్టీకి గట్టి దెబ్బ త‌గిలింది.

Back to Top