ఎన్నికల్లో అరాచకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సతీష్‌రెడ్డి 

వైయ‌స్ఆర్‌ జిల్లా: వేంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న షబ్బీర్‌కు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలను సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు.
లోకేష్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, పోలీసులు, రౌడీలు, అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రజలను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

కూటమి నాయకుల అరాచకాలను అధికారులు, పోలీసులు మౌనంగా చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. అవినీతి అధికారుల వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, ఎన్నికల్లో అరాచక శక్తులను ప్రజలు తమ ఓటుతో తరిమికొట్టాలని సతీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రంలో అరాచక శక్తులుగా మారారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Back to Top