స్థానిక ఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు 

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అభ్యర్థులపై దాడులు.. నామినేషన్లకు అడ్డంకులు 

ఏలూరు జిల్లా: వేలేరుపాడులో ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ వాహనాన్ని అడ్డగించి టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆయనకు చెందిన ఆస్పత్రిపై కూడా రాళ్లతో దాడి చేశారు. 

  • ఏలూరులో టీడీపీ అక్రమాలను ప్రశ్నించిన అడ్వకేట్‌ స్వర్ణలతపై దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు. తనపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చారని, గతంలోనూ తనపై దాడులు జరిగినా చర్యలు తీసుకోలేదని తెలిపారు.
  • వైయ‌స్ఆర్‌ జిల్లాలోని ఖాజీపేట మండలం చెంబులపల్లె క్లస్టర్‌లో నామినేషన్‌ తిరస్కరణకు కారణం అడిగిన వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపై ఆర్వో ఎదుటే టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
  • శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఓటమిని జీర్ణించుకోలేక వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని, ఇద్దరు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం 19 మంది వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేసి, కౌన్సిలర్‌ సహా తొమ్మిది మందిని రిమాండ్‌కు తరలించారు.
  • తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లిలో మెజారిటీ ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను కాదని ఉపసర్పంచ్‌ పదవి టీడీపీకేనంటూ టీడీపీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
  • గురజాలలో కొన్ని నామినేషన్లు తిరస్కరించడంపై అప్పీల్‌ చేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలతో నామినేషన్‌ ప్రక్రియకు అవకాశం వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
Back to Top