పెనుకొండ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

 పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ 

 పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోనిపెంట, శెట్టిపల్లి, రాంపురం, ఎలమంచి పంచాయతీల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు. పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధతకు గుర్తింపుగా, ప్రతి కార్యకర్తకు పార్టీ పరంగా గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ఐడీ కార్డులు అందిస్తున్నట్లు ఉషశ్రీ చరణ్‌ తెలిపారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు నాయకత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లోని నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

Back to Top