తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసవర్మ కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైయస్ జగన్‌కు బహుకరించారు. వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసవర్మ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన వారిలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసవర్మతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు ఉన్నారు.