తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించింది. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా పీవీఎల్ నరసింహరాజును నియమించారు. అలాగే ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ (బాబు)ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది.