రాష్ట్ర‌ ప్రజలకు వైయ‌స్‌ జగన్‌ తొలి ఏకాదశి శుభాకాంక్షలు 

తాడేపల్లి: ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
 
ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు

Back to Top