రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద  జక్కంపూడి రాజా ధ‌ర్నా

సీఐ హామీతో ఆందోళన విరమించిన జక్కంపూడి రాజా 

తూర్పుగోదావరి జిల్లా:  రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారని తెలిసి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదును తగిన విధంగా నమోదు చేయాలని ఆయన పోలీస్ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో కొంతసేపు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని సమీక్షించిన సీఐ వీరయ్య గౌడ్, ఫిర్యాదును స్వీకరించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు హామీ ఇచ్చారు. దీనితో ఆందోళన విరమించారు. 

Back to Top