పంతం నానాజీపై పులివెందుల డీఎస్పీకి ఫిర్యాదు

 పులివెందుల: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పులివెందుల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పులివెందుల డీఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు కిషోర్‌తో పాటు ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. నానాజీపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసు అధికారులను కోరారు.
 

Back to Top