అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తి..

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు

విశాఖలో ఘనంగా జయంతి వేడుకలు

విశాఖపట్నం: మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఆశయాలు యువతకు స్ఫూర్తి..అని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు తెలిపారు. అల్లూరి 129వ జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఘనంగా నివాళులర్పించారు. సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటారు. అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలు భావితరాలకు ఆదర్శమని కేకే రాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాధం, సతీష్ వర్మ, జహీర్ ఆహ్మద్, రాష్ట్ర, మాజీ జిల్లా స్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జీవీఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top