తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనుండగా, జూలై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు. జూలై 7 (మంగళవారం): వైయస్ జగన్ ఉదయం 11.30 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పులివెందులలోనే బస చేస్తారు. జూలై 8 (బుధవారం): ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.