నాపై విజిలెన్స్ విచారణ చేసేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఉన్న అధికారం ఏంటి..?

ప్రైవేటు వ్యక్తినైన నాపై విచారణ చేసే హక్కు ఎక్కడది..?

భూమన కరుణాకర్ రెడ్డి నిలదీత

తిరుపతిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 

ఒకే క్రైమ్ నెంబర్ పై రెండు కేసులా..?

దేశంలో ఎక్కడైనా ఉందా..?

భూమన కరుణాకర్ రెడ్డి సూటి ప్రశ్నలు

కలెక్టర్ వెంకటేశ్వర్లు అవినీతి చక్రవర్తిగా తయారయ్యారు

ఇసుకలో రూ. 50 లక్షలు, గ్రావెల్ లో రూ. 25 లక్షలు వసూళ్లు

ఇక్కడి అక్రమ సంపాదనతో తన మామతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్

సివిల్ వివాదాలన్నీ జోక్యం చేసుకుంటూ లూటీ చేస్తున్నారు

వైయ‌స్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన మండిపాటు

నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపిస్తే నన్ను కాల్చుకుని చనిపోతా

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే కలెక్టర్ ప్రతీ ఫైల్ పైనా విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం

అక్రమ వ్యవహారాల్లో ఎవరినీ వదిలిపెట్టేది లేదు

భూమన స్పష్టీకరణ

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ల అండదండలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు  అవినీతి సామాజ్రానికి చక్రవర్తిగా తయారయ్యారని వైయ‌స్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండపడ్డారు. జిల్లాలోని అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లె పెట్టుకుని సివిల్ వివాదాల్లో దూరి  తన అధికారంతో శాసిస్తూ కోట్లాది రూపాయలను లూటీ చేసి అవినీతి చక్రవర్తిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గా వెంకటేశ్వర్లు తనపై తప్పుడు కేసులు నమోదు చేయించడంతో పాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ చేయించడమేంటని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తిగా తనపై విజిలెన్స్ విచారణ జరిపించే అధికారం కలెక్టర్ కు ఎక్కడదని నిలదీసారు. తనను భూ కబ్జాదారుగా, గూండాలుగాా చిత్రీకరించేలా విజిలెన్స్ విచారణ నివేదికలో నమోదు చేయించారని భూమన ధ్వజమెత్తారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులెవరైనా సరే అవినీతికి పాల్పడితే వారిపై విజిలెన్స్ విచారణ చేపిస్తారు తప్పితే, ప్రైవేటు వ్యక్తినైన తనపై ఏ హక్కుతో కలెక్టర్ వెంకటేశ్వర్లు విచారణ చేయిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేసారు. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఓ డాకూ మంగల్ సింగ్ వలె, ఇన్ చార్జి మంత్రి అనగాని సత్యవరప్రసాద్ ఓ ఛార్లెస్ శోబ్ రాజ్ వలె వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... 

- ఒకే క్రైమ్‌ నంబర్‌పై రెండు కేసులా..?   దేశంలో ఎక్కడైనా ఉందా..?

తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో నాపై కేసు నమోదు చేసారు. ఈ కేసు నమోదు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.  2021, 2023 రిట్ పిటీషన్లకు సంబంధించి నాపై కేసు నమోదు చేసి ఆన్ లైన్ పెట్టారు. అయితే రాత్రికి రాత్రే మళ్లీ ఆన్ లైన్ పేరు తొలగించారు. ఒకే క్రైమ్ నెంబర్ తో రెండు కేసులు నమోదు చేయడం దేశంలో ఎక్కడైనా చూసామా.. ? చట్టపరంగా ఎలా సాధ్యమవుతుంది.  పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటే  ఇలాంటి అడ్గగోలు అక్రమ కేసులే నమోదు చేస్తారు.  దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించాం.   సివిల్‌ వివాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్‌ నేరుగా జోక్యం చేసుకోవడం కలెక్టర్ స్థాయి అధికారులకు ఎటువంటి అధికారాలు, హక్కులు లేవు.  2021, 2023లో దాఖలైన రిట్‌ పిటిషన్లకు సంబంధించిన వివాదంలో తనపై క్రిమినల్‌ ఆరోపణలు చేయడానికి సంబంధించి సరైన ఆధారాలను కలెక్టర్ చూపాలి.  నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఏ చిన్న తప్పు చేయలేదు. ఎటువంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడినది లేదు. అలాంటిది నన్ను భూ కబ్జాదారునిగా, గుండూగా చిత్రీకిరించే కలెక్టర్ వ్యవహారాలను సాగనివ్వం. 

- అవినీతి చక్రవర్తి కలెక్టర్ వెంకటేశ్వర్లు.. 

 సివిల్ వివాదాల్లో  కలెక్టర్ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకోవడం ఏమిటి..?  చిత్తూరు జిల్లాలో వేలాది సివిల్ కేసులు ఉన్నాయని.. వాటిలో కలెక్టర్ పంచాయితీలు చేస్తారా?   జిల్లా కలెక్టర్ గా ఇవేనా విధులు.? చిత్తురూ జిల్లా పరిధిలో భూముల వ్యవహారంలో కలెక్టర్ చాలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. తన అధికారం ఉపయోగించుకుని  సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ కమీషన్ల వాటాలను కలెక్టర్ వసూళ్లు చేసుకుంటున్నారు.  జిల్లాలో భూముల రెగ్యులరైజేషన్ ఫల్సైన్ క్షణాల్లో మార్చేస్తున్నారు. అలాగే  22ఏ, ఆర్ఓఆర్ అప్పీల్స్, హోటల్ అనుమతులు, ఎండోమెంట్స్ భూముల విషయంలో కలెక్టర్ జోక్యంతో పెద్ద ఎత్తున   అవినీతి జరుగుతోంది.  రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో సుమారు రూ. 2 వేల కోట్ల  మేర కలెక్టర్ వెంకటేశ్వర్లు లూటీ చేసారు. జిల్లాలో  అక్రమ రవాణా ఇసుకలో రూ. 50లక్షలు కలెక్టర్ కనుసన్నలలో వసూళ్లూ సాగుతున్నాయి. అలాగే  గ్రావెల్ లో రూ. 25 లక్షలు రోజూ వారీ వాటా కాజేస్తున్నారు. అనేక ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కోట్లాది రూపాయలు తన అనుయాయాలు ద్వారా  కమీషన్లు వసూళ్లు చేస్తున్నారు.  ఇక్కడ అవినీతి, అక్రమాలతో సంపాదించిన డబ్బును  మామతో కలసి బెంగళూరులో రియల్  ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నాడు.  అలాగే కలెక్టర్  వెంకటేశ్వర్లు తన కుమార్తె బారసాలకు స్టార్ హోటల్లో వేడుకలు చేసి పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్లు చేయించలేదని చెప్పగలరా..?  ఇంతటి అవినీతి చక్రవర్తి స్వాతంత్ర దినోత్సవ రోజున జెండా ఆవిష్కరణ చేస్తే త్రివర్ణపతకానికి అవమానం. స్వాతంత్ర సమరయోధులు చూసి తలదించుకునే పరిస్థితి దాపురించింది. 

- కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రతీ ఫైల్ ను విచారణ చేయిస్తాం

వైఎస్సార్ సీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పాలనలో జరిగిన ప్రతి వ్యవహారాన్ని తరిగతోడుతాం. కలెక్టర్‌ సహా సంబంధిత అధికారుల నిర్ణయాలు, భూ వ్యవహారాలు, అనుమతులు, కేటాయింపులు, పోలీసు కేసుల నమోదు వంటి అంశాలపై ఫైల్‌ వారీగా విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన అధికారులు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టపరంగా చర్యలు తప్పవు.  కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పై ఉన్న ప్రతి ఫైల్‌ను భవిష్యత్తులో విచారణ చేయిస్తాం. నిజానజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు పెడతాం. ఎట్టి పరిస్థితిల్లోనూ కలెక్టర్ వెంకటేశ్వర్లు అవినీతి వ్యవహారాలను వదిలిపెట్టేది లేదు.  

- ప్రభుత్వం సమాధానం చెప్పాలి 

పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసి, వాటిని ఆన్‌లైన్‌లో ఉంచి, తర్వాత కనిపించకుండా చేయడం వంటి పరిణామాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎక్కడా లేని విధంగా ఒకే క్రైమ్ నెంబర్ పై రెండు కేసులు నమోదు చేసిన వ్యవహారంపై ఏం సమాధానం చెప్పగలరు. చంద్రబాబు, లోకేశ్ వంటి వారి   రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించాలి.   నాపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదు. అలాగే జిల్లె కలెక్టర్ వెంకటేశ్వర్లు సాగిస్తున్న అక్రమ, అవినీతి వ్యవహారాలపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే.  కలెక్టర్ పదవి లో ఉండి సివిల్ సెటిల్మెంట్లు,ఇసుకు, గ్రావెల్ లో అక్రమ తవ్వకాలకు గాను వాటాలు, రియల్ ఎస్టేట్ వ్యపారాలు సాగిస్తుండటం వంటి వ్యవహారాలన్నీ జిల్లా ప్రజలకు తెలుసు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆయనకు వత్తాసు పలుకుతూ కొమ్మ కాయడం అనుమానాలకు తావిస్తోంది. నాపై  చేసిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. నా భూ కబ్జాదారునిగా, గూండాగా కలెక్టర్ వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి ఆధారాలు చూపినా సరే నన్ను నేను కాల్చుకుని చనిపోతా.  నా పై ‘భూకబ్జాదారు’, ‘గూండాలు’ వంటి పదాలు ఉపయోగించడం అభ్యంతరకరం.  దీనిపై న్యాయపరంగా కూడా పోరాడుతా.

Back to Top