డీఎస్సీ దగా బట్టబయలు.. బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి

 

డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తెస్తున్న కూటమి ప్రభుత్వం

సిట్, ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేసిన అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి

పుత్తా శివశంకర్

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్

డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి తమ వారికి పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు

డీఎస్సీ వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్నా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు

సిట్ నివేదికలో డిజిటల్ మూల్యాంకనం జరగలేదని స్పష్టంగా ఉంది

ఏడు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ల పరిశీలనలో జవాబు పత్రాల్లో ఎలాంటి మార్పులు గుర్తించలేదు

ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది

ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చినా డీఎస్సీ వ్యవహారం నుంచి వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తప్పించుకోలేదు

నిరుద్యోగుల భవిష్యత్తుకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది

డీఎస్సీపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి సమాధానం చెప్పాల్సిందే

తాడేపల్లి: డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సిట్ నివేదిక, ఏడు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ల నివేదికలు ఇప్పటికే కీలక విషయాలను స్పష్టం చేశాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్ మాట్లాడుతూ...

- సిట్ నివేదికతో వాస్తవాలు స్పష్టం

డీఎస్సీలో డిజిటల్ మూల్యాంకనం జరిగిందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. హైకోర్టు ఆదేశాల మేరకే మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. సిట్ నివేదికలో కూడా డిజిటల్ మూల్యాంకనం జరగలేదని స్పష్టంగా ఉంది. ఓఎంఆర్ షీట్లలో బబ్లింగ్ మాత్రమే జరిగిందని, అక్కడ మూల్యాంకనం జరగలేదని సిట్ నివేదిక పేర్కొంది. ఏడు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌లలో జవాబు పత్రాలను పరిశీలించినా ఎలాంటి మార్పులు, అదనపు చేర్పులు గుర్తించలేదు.

- పారదర్శకతకు ఏపీపీఎస్సీలో సంస్కరణలు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం అనేక మార్పులు తీసుకొచ్చాం. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వేలిముద్రలు, ముఖ గుర్తింపు విధానాలను అమలు చేశాం. మూల్యాంకన ప్రక్రియను కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాం. ఇంటర్వ్యూల కోసం మూడు బోర్డులు ఏర్పాటు చేసి 24 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆరుగురు వైస్‌చాన్సలర్లను భాగస్వామ్యం చేశాం. క్యూ ఆర్ కోడ్ ద్వారా అభ్యర్థులను బోర్డులకు కేటాయించి పారదర్శకతను పెంచాం.

- ఏపీపీఎస్సీని డీఎస్సీకి ముడిపెట్టడం ఎందుకు?

చంద్రబాబు హయాంలోనే ఏపీపీఎస్సీకి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అదే నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌లో 62 తప్పులు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. ప్రస్తుతం డీఎస్సీలో జరిగిన అంశాల నుంచి తప్పించుకునేందుకు ఏపీపీఎస్సీని తెరపైకి తీసుకురావడం దృష్టి మళ్లించే ప్రయత్నమే. ఏపీపీఎస్సీ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగిందని ప్రభుత్వం భావిస్తే, దానిని ప్రజల ముందు పెట్టాలి.

- యువత ఉద్యోగాలను ఎందుకు నిలిపివేశారు?

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ నుంచి 88 నోటిఫికేషన్లకు క్లియరెన్స్ తీసుకొచ్చాం. అందులో 54 నోటిఫికేషన్లు జారీ చేశాం. డీఈఓలు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖలోని పోస్టులు, అటవీ శాఖ పోస్టులు, ఇతర కీలక పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటిలో కీలకమైన నోటిఫికేషన్లను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకుండా నిలిపివేసింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం నియామకాలను పక్కన పెట్టడం సరికాదు.

- డీఎస్సీ నుంచి తప్పించుకోలేరు

ఎన్ని అంశాలు తెరపైకి తెచ్చినా డీఎస్సీలో జరిగిన వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించకుండా అడ్డుకోవడం వల్ల వాస్తవాలు మారవు. నిరుద్యోగులు, యువతకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డీఎస్సీపై ప్రజల ముందు వాస్తవాలు ఉంచే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది.

సిట్, ఫోరెన్సిక్ పరిశీలనల్లో వెల్లడైన అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చి డీఎస్సీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించలేరని పేర్కొన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీపై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 

Back to Top