రెండేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు

ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అణచివేతలు

చంద్రబాబు అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం

బీసీలకు భరోసాగా త్వరలో విజయవాడలో సభ 

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ నేతల వెల్లడి

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ నేతల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మాజీ ఎంపీ మార్గాని భరత్, 

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించాం

వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ

జోగి రమేశ్ వెల్లడి

బీసీలకు ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు

ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు

పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా ?

చంద్రబాబు మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టీకరణ

చంద్రబాబుది అబద్దాల మ్యానిఫెస్టో

బీసీలకు ఇచ్చిన ప్రతీ హామీ విస్మరించారు

రమేశ్ యాదవ్ ధ్వజం 

బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది టీడీపీయే

స్థానిక ఎన్నికల్లో ఇస్తారా లేదా చెప్పాలి

మార్గాని భరత్ డిమాండ్ 

తాడేపల్లి: రాష్ట్రంలో బీసీల ఓట్లతో గెలిచి, రెండేళ్ల పాలనలో వారికిచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలుచేయలేదని వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించిన నేతలు.. త్వరలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాల్ని వివరిస్తామని ప్రకటించారు. 
ప్రెస్ మీట్లో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేతలు ఏమన్నారంటే..

జోగి రమేశ్, మాజీ మంత్రి
 
రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. బీసీల్ని ఎలా అణగదొక్కుతున్నారో చూస్తున్నాం. రెండేళ్లుగా బలహీనవర్గాలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ బీసీ నేతలు చర్చించాం. బీసీలకు చంద్రబాబు ఏం చెప్పారు, ఎలా మోసం చేశారన్న దానిపై జనాలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేతలంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఖరారు చేస్తాం. జోనల్ వారీగా ఈ కార్యాచరణ ఉంటుంది. బలహీన వర్గాలంతా ఒక్కటే, అంతా ఒక్క తాటిపైకి వచ్చి బలవంతులుగా మారి శక్తివంచన లేకుండా పోరాడతాం. 2014-19 మధ్య చంద్రబాబు తన పాలనలో బీసీ అయిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎంగా కొనసాగించారు. మా హయాంలో బీసీలతో పాటు మొత్తం ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు రెండేళ్లుగా మా వర్గానికి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. 

పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకూ, అమలుకూ ఏమాత్రం పొంతన లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల బీసీ వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, వారికిచ్చిన హామీలకు ఎందుకు తిలోదకాలు ఇచ్చారు, ఈ వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటి?, వారిని ఇంకా ఎందుకు అణచివేయాలని అనుకుంటున్నారో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో విజయవాడలో సమావేశం కాబోతున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పటికీ లేని ఫీజు రీయింబర్స్ మెంట్ ను అప్పట్లోనే తొలిసారి అమలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్ల కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజును తల్లితండ్రులు అప్పులు చేసి చెల్లించాల్సి వస్తోంది. కూటమి సర్కార్ వారిని అన్ని విధాలుగా ఇబ్బందిపెడుతోంది. దీని వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఆర్దికంగా నష్టపోతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోందని పెద్ద ఎత్తున అప్పట్లో దుష్పచారం చేసిన వాళ్లు. ఇప్పుడు రెండేళ్లలోనే అంతకంటే ఎక్కువ అప్పులు చేశారు. కావాలంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటికైనా చంద్రబాబు బీసీ వర్గాలకు జరుగుతున్న నష్టంపై స్పందించాలి. లేకపోతే ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ వర్గాల ప్రతినిధులుగా ప్రశ్నిస్తూనే ఉంటాం. చంద్రబాబు చేసిన తప్పు సరిచేసుకుంటారా లేక ఇంకా అణచాలని ప్రయత్నిస్తారా చూస్తాం.

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి

రెండేళ్లలో బీసీల్ని అవమానిస్తున్న తీరు మీద ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ బీసీ ప్రతినిధులంతా సమావేశమై చర్చించాం. బీసీల్ని చంద్రబాబు అవమానించారని స్పష్టంగా చెప్పగలం. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీ వర్గాలకు ఇప్పటికీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. 50 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈ దేశానికి ఆదర్శంగా, బలహీనవర్గాలు సామాజికంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, భూమి ఉండాలి, విద్య ఉండాలి. కానీ మీ హయాంలో ఆదరణ పథకంతో బీసీల్ని కూలీలుగా కొనసాగించాలని చూస్తే, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హయాంలో బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. 34 శాతం రిజర్వేషన్ 24 శాతం తగ్గించడంలో బిర్రు ప్రతాపరెడ్డితో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి బీసీ వర్గాలను మోసం చేశారు. మా ప్రభుత్వంలో కులగణన చేసిన లెక్కలున్నాయి. వాటి ఆధారంగా బీసీలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. చంద్రబాబు నైజాన్ని బీసీలకు తెలియజేస్తాం. బీసీ వర్గాలకు చేసిన మోసంపై వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించబోతున్నాం. 

రమేశ్ యాదవ్, ఎమ్మెల్సీ

ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ బీసీ ముఖ్యనేతలంతా సమావేశమై నారా వారి అబద్దాల మ్యానిఫెస్టోను బయటికి తీసి చర్చించాం. బీసీలు ఎన్ని అబద్దాలు చెప్పినా వాళ్లు ఓటేస్తారు, తర్వాత వారికి వెన్నుపోటు పొడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీ హామీని విస్మరించారు. తద్వారా వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మోసాల్ని వివరించబోతున్నాం. విజయవాడలో ఓ సమావేశం పెట్టుకుని నారా వారి వెన్నుపోటు ఎలా ఉందో జనాలకు తెలియజేస్తాం. అనంతరం జిల్లా, జోనల్ స్ధాయిల్లోనూ సమావేశాలు నిర్వహించబోతున్నాం.

మార్గాని భరత్, మాజీ ఎంపీ

బీసీల్ని గౌరవించామంటూ గతంలో కేఈ కృష్ణమూర్తికి గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం ఎందుకు ఆ సంప్రదాయం కొనసాగించలేదు. మా పార్టీలో బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉపముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనే ఆలోచన లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నది టీడీపీయే. స్వచ్చందంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ తెచ్చి బీసీలకు న్యాయం చేస్తారా లేదా చెప్పాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 50 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది ? గతంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మేం అందించిన సంక్షేమ పథకాల్ని ప్రజలు ఓసారి గుర్తుంచుకోవాలి. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ గొంతునొక్కాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పార్టీ బీసీ నేతలు విజయవాడలో సమావేశమై వాస్తవాల్ని ప్రజల ముందుపెడతాం. 

Back to Top