ఓటర్లకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ

అనంత‌పురం జిల్లా కార్యాలయంలో "ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్" ఏర్పాటు

తొలి రోజే 550 మంది ఓటర్ల సందేహాల నివృత్తి

అనంతపురం: ఓటర్లకు అవసరమైన సమాచారం అందించి, ఓటరు జాబితా సంబంధిత సందేహాలను నివృత్తి చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో "ఎస్‌ఐఆర్ (SIR) హెల్ప్ డెస్క్"ను ఏర్పాటు చేశారు. 2002 ఓటరు జాబితాను పరిశీలించేందుకు, ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ బృందాలను ఏర్పాటు చేయగా, తొలి రోజే సుమారు 550 మంది ఓటర్లు హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఓటరు జాబితా పరిశీలన, ఎన్యుమరేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథ్ రెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్ బాబు, నరేంద్ర, రామ్మోహన్, అమీనా, హర్షద్, రఘునాథ్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top