తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ వైయస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీ వైయస్ జగన్ మధ్యాహ్నం దేవరపల్లి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.