తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత దువ్వూరి కృష్ణ ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల నిర్వహణ, ప్రజా సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనలో దువ్వూరి కృష్ణ తన అనుభవాన్ని వినియోగించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముదునూరి మురళీకృష్ణంరాజు నియామకం వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.