డీఎస్సీ అక్రమాలపై ఏలూరులో టౌన్‌హాల్ సమావేశం

 సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా డిమాండ్

 ఏలూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు.

 యువత, విద్యార్థులకు న్యాయం చేయాలి

ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో ఏ–1 క్రిస్టల్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

 కార్పొరేటర్లకు సన్మానం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు హాజరయ్యారు. ఇటీవల ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఏలూరు కార్పొరేటర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top