జర్మనీ: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్‌గార్ట్, బెర్లిన్ నగరాల్లో వైయస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వైయస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహానేతకు ఘన నివాళులర్పించారు. ఆయన ప్రజాసేవ, సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ వైయస్‌ఆర్ సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తమ జీవితాల్లో వైయస్‌ఆర్ కీలకమైన మార్పు తీసుకొచ్చారని పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన అందించిన విద్యా అవకాశాల వల్లే నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని, అందుకు మహానేత వైయస్‌ఆర్‌కు ఎప్పటికీ కృతజ్ఞులమని తెలిపారు. మ్యూనిచ్‌లో వైయస్‌ఆర్ చెస్ టోర్నమెంట్ వైయస్‌ఆర్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని మ్యూనిచ్ నగరంలో ప్రత్యేకంగా “వైయస్‌ఆర్ చెస్ టోర్నమెంట్” నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. యువత, వైయస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కృష్ణ తేజ రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌సీపీ జర్మనీ కోర్ కమిటీ సభ్యులు సమన్వయంతో విజయవంతం చేశారు. జనరల్ సెక్రటరీ నాగార్జున రెడ్డి ఆవుల, కో-కన్వీనర్ గురు, ఐటీ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డి మార్తల, మీడియా స్పోక్స్‌పర్సన్లు డాక్టర్ మల్లికార్జున రెడ్డి బండి, మనోజ్ కామసాని, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రెడ్డి కలమకూరి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సాయి సూర్య చౌదరి, మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్నగారి, వినోద్ అమలదాసు, షాలిని అక్షింతల తదితరులు పాల్గొన్నారు. ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు కూడా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారు. మ్యూనిచ్, స్టుట్‌గార్ట్, బెర్లిన్ నగరాల్లో జరిగిన కార్యక్రమాల్లో వైయస్‌ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. వైయస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. మహానేత ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.