అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంబంధించిన భూ అక్రమాలపై నిరసన చేపట్టిన వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విశ్వేశ్వరరెడ్డితో పాటు మొత్తం 41 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడైంది. అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ కేసులు పోలీసుల అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడంతో పాటు సెక్షన్–30 నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భూ వివాదాల అంశంపై శాంతియుతంగా నిరసన తెలియజేసిన నాయకులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వైయస్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.