తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి మండలంలో టోబాకో బోర్డు పరిధిలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారి తరఫున గళం వినిపించేందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు దేవరపల్లికి విచ్చేస్తున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం నుంచి దేవరపల్లి వరకు జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 150 కార్లు, 500 బైకులతో భారీ కాన్వాయ్‌గా దేవరపల్లి వైపు తరలివెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ నాయుడు గారు మాట్లాడుతూ, పొగాకు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాడేందుకు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం రైతుల్లో కొత్త ఆశలు నింపిందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించే వరకు, పొగాకు రైతుల సమస్యలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని తెలిపారు. "రైతు గళమే... ప్రజా గళం" అనే నినాదంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొని దేవరపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.