విశాఖ: ప్రజల కోసం, గిరిజన బిడ్డల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి డా. మంచా నాగమల్లేశ్వరిని మహిళ అన్న కనీస గౌరవం లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను అరెస్టులతో అణచివేయడం సరికాదని, ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అరెస్టులు, బెదిరింపులతో వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని ఆపలేరని నేతలు పేర్కొన్నారు. గిరిజన బిడ్డల హక్కులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రశ్నించే గొంతును మరింత బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు.