మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అరెస్ట్‌.. 

పోలీసుల తీరుపై ఆగ్రహం

విశాఖ: మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం అన్న గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం ఎక్కించే సమయంలో పోలీసులు తన చీర పట్టుకుని లాగారని, మహిళలన్న గౌరవం కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై పుష్పశ్రీవాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద లేకుండా వ్యవహరించవద్దని పోలీసులను నిలదీశారు. మహిళా నాయకురాలితో వ్యవహరించే తీరుపై పోలీసులు కనీస సంయమనం పాటించాలని పేర్కొన్నారు.
 

Back to Top