తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1,2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైయస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.