డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలి

 కేపీ నాగార్జునరెడ్డి డిమాండ్‌
 

గిద్ద‌లూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే  కేపీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బేస్తవారిపేట మండల కేంద్రంలో మంగళవారం టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసురెడ్డి, జెడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య, పగడాల శ్రీరంగం, ప్రకాశం జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్, పల్లెబోయిన వెంకటరాజు, మండల కన్వీనర్లు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు ఎం. మల్లికార్జున, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన విభాగ సభ్యులు పాల్గొన్నారు.
 

Back to Top