తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు (12.08.2026) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన కార్యాచరణపై వైయస్ జగన్ సూచనలు చేయనున్నారు. ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ తరఫున చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.