డీఎస్సీ ర్యాలీలో గాయపడిన కృపా లక్ష్మీకి పరామర్శ

చిత్తూరు జిల్లా: డీఎస్సీ–2025 అవకతవకలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 10న జీడినెల్లూరు మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో గాయపడిన నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మీని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పరామర్శించారు. జీడినెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పోలీసుల తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో బారికేడ్ కృపా లక్ష్మీ కాలిపై పడటంతో ఆమెకు గాయమైంది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వల్లివేడు పృథ్వీరెడ్డి బుధవారం కృపా లక్ష్మీని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డీఎస్సీ అవకతవకలపై శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీలో గాయపడిన కృపా లక్ష్మీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు.

 

Back to Top