విజయవాడ: శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, అవకతవకలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గౌతంరెడ్డి కిందపడిపోయారు. పోలీసులు నెట్టేయడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోగా, పార్టీ నాయకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులపైనా పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఆందోళన సందర్భంగా నాగార్జున యాదవ్, జక్కంపూడి రాజా తదితర వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపేందుకు వచ్చిన నాయకులు, విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.