మాచర్లలో టీడీపీ నేతల అరాచకం

 బీఫారాలు అందజేసేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడి

 మాచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఫారాలు అందజేసేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కారణంగా అభ్యర్థులు తమ బీఫారాలను సమర్పించలేకపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు ఇలాంటి ఘటనలు అడ్డంకిగా మారుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆగ్ర‌హం వ్యక్తం చేశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో షేక్‌ సుల్తానాతో పాటు మరో 33 మంది వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు బీరువా గుర్తు కేటాయించారు.  ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడంతో పాటు, అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Back to Top