సర్వేపల్లిలో టీడీపీకి వరుస షాక్‌లు

వైయ‌స్ఆర్‌సీపీలోకి 50 కుటుంబాలు

కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన ఎగువమిట్ట గ్రామస్థులు

నెల్లూరు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. దుత్తపాటి మహేష్‌, పాకం వెంకటరమణయ్య, దుత్తపాటి శివ, వేనాటి జయ, అప్పగుంట సుమన్‌, దుత్తపాటి చరణ్‌, నెల్లూరు శ్రీకాంత్‌, నెల్లూరు కరుణాకర్‌, నెల్లూరు హర్షవర్ధన్‌, నెల్లూరు రమేష్‌, కూనమల్లి వెంకటేశ్వర్లు, తాండ్ర శ్రీనివాసులు, కూనమల్లి రమేష్‌బాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏకపక్ష వైఖరి, కక్షసాధింపు రాజకీయాలతో విసిగిపోయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకం, గత ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాలపై విశ్వాసంతో ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ వైపు వస్తున్నారని తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

టీడీపీ వేధింపులకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భయపడబోవని, ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని కాకాణి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Back to Top