తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ నెల 27, 28 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (27వ తేదీ) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయస్ జగన్, అనంతరం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. బుధవారం (28వ తేదీ) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.