బెదిరింపులకు భయపడొద్దు.. ఓటుతో ప్రజాస్వామ్య సత్తా చాటండి!

 మదనపల్లెలో కూటమికి ప్రజా తీర్పుతో సమాధానం చెప్పాలి

 మదనపల్లె: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం మదనపల్లె పట్టణంలోని 28వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జింకా వెంకట చలపతికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. నరేశ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎస్‌. నిసార్‌ అహ్మద్‌, ఎస్‌ఈసీ సభ్యురాలు షమీమ్‌ అస్లాం, దేవత సతీశ్‌ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుసుకుని అభ్యర్థికి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌. నిసార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, ఓటర్లను భయపెట్టి ఎన్నికల్లో ప్రభావం చూపాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును ఎవరూ అడ్డుకోలేరని, ఓటర్లు నిర్భయంగా తమ నిర్ణయం తీసుకోవాలని కోరారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, జవాబుదారీ పాలన కోసం వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బెదిరింపులకు తలొగ్గకుండా ఓటు హక్కును వినియోగించుకోవడమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలమని నాయకులు స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top