ఆదోనిలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం

ఆదోని: ఆదోని మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి ప్రణీతారెడ్డి, 40వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి భాషకు మద్దతుగా కర్నూలు పార్లమెంట్‌ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు చంద్రకాంత్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని అభ్యర్థులకు మద్దతు కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వార్డుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ప్రణీతారెడ్డికి, 40వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి భాషకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Back to Top