తాడేపల్లి: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల తీర్పు కూటమి ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలిచ్చినట్లు కనిపిస్తోంది. చిత్తూరు, కడప కార్పొరేషన్లలో వైయస్ఆర్‌సీపీ ఆధిక్యంలో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పులివెందుల, నెల్లిమర్ల, పెడన, పిఠాపురం, ఉయ్యూరు, పలాస ప్రాంతాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో వైయస్ఆర్‌సీపీ ముందంజలో ఉంది. విశాఖపట్నం, అనంతపురం, విజయనగరం కార్పొరేషన్లలో కూడా వైయస్ఆర్‌సీపీకి గణనీయంగా ఉద్యోగుల ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో కూటమికి ఏకపక్ష మద్దతు లభించకపోవడం ఈ పోస్టల్ బ్యాలెట్ సరళిలో ప్రధాన అంశంగా నిలిచింది.