మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ సహా 70 మందిపై అక్రమ కేసు 

పులివెందుల అరాచకాల్లో మరో అంకం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమంటే ప్రతిపక్ష నేతపై కేసు

అనుమతి లేకుండా ధర్నా.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపణలు

వైయ‌స్ఆర్ జిల్లా :  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకుని న్యాయం చేయాలని కోరిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అస్త్రాన్ని ప్రయోగించింది. పులివెందులలో ప్రభుత్వ ప్రేరిత అరాచకాలకు నిరసనగా చేపట్టిన ఆందోళనపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పేరుతో వైయ‌స్‌ జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు 70 మందికిపైగా మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 1వ తేదీన పులివెందుల మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారంటూ అభియోగాలు మోపారు. 

రఫీక్‌ ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ అక్రమ కేసు నమోదయ్యింది.  అధికార పార్టీ నేతల దురాగతాలపై, అధికారులు ముఖ్యంగా పోలీసుల నిర్లిప్తతపై వైయ‌స్‌ జగన్‌ 70 మందికి పైగా పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి పులివెందుల మున్సిపాలిటీ రిటర్నింగ్‌ అధికారికి ఆదివారం ప్రజాస్వామ్యయుతంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పులివెందులలోని మొత్తం 80 పోలింగ్‌ బూతులలో ఎన్నికలను రద్దు చేసి, రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.    

Back to Top