నకరికల్లులో వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి భర్త అరెస్ట్‌

 లక్ష్మారెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

 పల్నాడు జిల్లా: నకరికల్లులో వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కందుల హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, లక్ష్మారెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని పోలీసులు వెల్లడించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నారో వెంటనే వెల్లడించి, ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Back to Top