అన్నమయ్య జిల్లా: పుంగనూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాజంపేట ఎంపీ, వైయస్ఆర్సీపీ శాసనసభాపక్ష నేత పి.వి. మిధున్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు కల్పించాలని, అభ్యర్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని కోరారు. పోలీసులు అన్ని రాజకీయ పార్టీల పట్ల సమానంగా వ్యవహరించాలని, అభ్యర్థులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని మిధున్‌రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని కాపాడి, ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.