తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రిలో టీడీపీ మూక‌లు రెచ్చిపోయారు. గన్నేవారిపల్లి కాలనీలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నలుగురు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. ఈ ఘటనల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత ప్రదీప్‌రెడ్డి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై కూడా రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Back to Top